డార్లింగ్ అనే మాటకు అర్థం ప్రభాస్
ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్' ఈ నెల 9న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో సినిమాలోని ‘నాచె నాచె..’ అనే పాటను విడుదల చేశారు.
ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముంబయిలో జరిగిన ఈవెంట్లో సినిమాలోని ‘నాచె నాచె..’ అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర కథానాయికలు రిద్దికుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా కోసం 36వేల స్కేర్ ఫీట్‌తో ఇండియన్ సినిమాలో ఇప్పటి దాక లేనటువంటి బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశామని, వీఎఫ్ఎక్స్ వర్క్ అత్యున్న ప్రమాణాలతో అబ్బురపరుస్తుందని, ప్రభాస్ వంటి స్టార్‌తో అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఇప్పటికే తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించానని, అయితే ‘రాజాసాబ్’ మరపురాని అనుభూతినిచ్చిందని, ప్రభాస్‌ను అందరూ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తారని, తన దృష్టిలో డార్లింగ్ అనే మాటకు నిజమైన అర్థం ప్రభాస్ అని సీనియర్ నటి జరీనా వహాబ్ అన్నారు. ప్రభాస్ వంటి మంచి మనసున్న వ్యక్తి హీరో కాబట్టి కథ గురించి తెలుసుకోకుండానే సినిమా అంగీకరించానని బొమన్ ఇరానీ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

