Team India Parade | ముంబైలో ‘విక్టరీ పరేడ్’.. అభిమానులూ ఇవి గుర్తుపెట్టుకోండి
Team India Parade : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు(Team India)కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. విక్టరీ పరేడ్ కోసం టీమిండియా ముంబైకి బయల్దేరింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అభిమానులకు ముందస్తుగా కొన్ని ఆదేశాలిచ్చారు.
Team India Parade : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు(Team India)కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)నివాసంలో అల్పాహారం ఆరగించిన రోహిత్ బృందం.. ప్రధానితో ఫొటో సంబురంలో పాల్గొంది. అనంతరం అశేష అభిమానుల మధ్య విజయోత్సవ పరేడ్ కోసం భారత జట్టు ముంబైకి బయల్దేరింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అభిమానులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా కొన్ని ఆదేశాలిచ్చారు. అవేంటంటే.?
చారిత్రాత్మకమైన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలనుకునే అభిమానులు మెరైన్ డ్రైవ్‌కు సాయంత్రం 4ః30 గంటల లోపే చేరుకోవాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రజా రవాణాను ఆశ్రయించండి. అక్కడికి వచ్చాక అందరూ ప్రొమనెడ్ వైపు మాత్రమే జమ కావాలి.
టీమిండియా ఆటగాళ్ల పరేడ్ బస్సు వెనకాలగానీ, బస్సుకు సమీపంగా గానీ ఎవరూ పరుగెత్తకూడదు. రోడ్డు పక్కన ఉన్న స్తంభాలు ఎక్కడం, డివైడర్ల మీద నొల్చోవడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదు.
𝗦𝗨𝗡𝗢, 𝗦𝗨𝗡𝗢, 𝗦𝗨𝗡𝗢 👂
Time pe aane ka, rules nahi todne ka, mazaa karne ka, masti karne ka. 🫡 #MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/wYFEum9SIN
— Mumbai Indians (@mipaltan) July 4, 2024
ఇక వాంఖడే స్టేడియంలో భారత జట్టును బీసీసీఐ సత్కరించనుంది. అందరికి ప్రవేశం ఉచితం కాబట్టి.. ఈ వేడుకను కండ్లారా చూడాలనుకునేవాళ్లంతా సాయంత్రం 6:30 గంటలకు ముందే స్టేడియంలో ఉండాలి.
రాత్రి 7:00 గంటలకు బీసీసీఐ పెద్దలు టీమిండియా సభ్యులను, హెడ్‌కోచ్ పదవి కాలం ముగించుకున్న రాహుల్ ద్రవిడ్, ఇతర సహాయక బృందాన్ని సన్మానించనున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ భారీగా ఈ పరేడ్‌కు హాజరవ్వాలని ఫ్యాన్స్‌కు పిలుపు నిచ్చాడు. దాంతో, ముంబైవాసులంతా పెద్ద సంఖ్యలో వరల్డ్ కప్ విజేతలకు స్వాగతం పలికేందుకు సిద్దమైపోయారు.
The triumphant Indian Cricket Team met with the Honourable Prime Minister of India, Shri Narendra Modiji, at his official residence today upon arrival.
Sir, we extend our heartfelt gratitude to you for your inspiring words and the invaluable support you have provided to… pic.twitter.com/9muKYmUVkU
— BCCI (@BCCI) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Jupally Krishna Rao | రేపు నల్లమలలో పర్యటించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- Bhairavana Kone Paata | ‘సప్త సాగరాలు దాటి’ దర్శకుడితో శివరాజ్ కుమార్ కొత్త సినిమా.. టైటిల్ ఎంటో తెలుసా.?
- Harish Rao | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు.. కాంగ్రెస్ సర్కార్‌కు చీమకుట్టినట్లైనా లేదు : హరీశ్‌రావు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

