Headingley Test : ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు లేకున్నా సరే తొలి టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు పీడకలను మిగిలిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట్), యశస్వీ జైస్వాల్(101) సెంచరీలతో కదం తొక్కారు. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(65 నాటౌట్) సైతం మెరుపు హాఫ్ సెంచరీతో బాదగా.. తొలి రోజే మూడొందలు కొట్టేసింది టీమిండియా. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన గిల్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 రన్స్ చేసింది. దంచికొట్టిన ఈ ఇద్దరూ క్రీజులో ఉండడంతో హెడింగ్లే టెస్టులో గిల్ సేన పట్టుబిగించడం ఖాయం అనిపిస్తోంది.
హెడింగ్లే టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. టాస్ ఓడిన టీమిండియాకు ఓపెనర్లు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101), కేఎల్ రాహుల్ (42) శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి సెషన్లో చెలరేగి ఆడిన ద్వయాన్ని బ్రాండన్ కర్సే విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(0) స్టోక్స్ వెనక్కి పంపాడు.
Stumps on the opening day of the 1st Test!
An excellent day with the bat as #TeamIndia reach 359/3 🙌
Captain Shubman Gill (127*) and Vice-captain Rishabh Pant (65*) at the crease 🤝
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/kMTaCwYkYo
— BCCI (@BCCI) June 20, 2025
సాయి వెనుదిరిగాక యశస్వీ జతగా గిల్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను పరుగులు పెట్టించిన ఈ జోడీ మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. ఐదో సెంచరీ బాదిన యశస్వీని టీ సెషన్ తర్వాత స్టోక్స్ బౌల్డ్ చేశాడు. అయినా సరే గిల్ పట్టుదలగా ఆడాడు. రిషభ్ పంత్(48 నాటౌట్), గిల్ నాలుగో వికెట్‌కు 138 రన్స్ చేసి.. స్టోక్స్ సేనను డీలా పడేలా చేశారు.
కెప్టెన్‌గా ఆడుతున్న తొలి ఇన్నింగ్స్‌లోనే వంద కొట్టిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు గిల్. హెడింగ్లేలో చిరస్మరణీయ సెంచరీ బాదిన అతడు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల సరసన చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ హీరో రికార్డు విజయ్ హజారే పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌పై ఢిల్లీ మైదానంలో శివాలెత్తిన హజారే 164 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 1976లో పగ్గాలు అందుకున్న సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్ గడ్డపై 116 రన్స్‌తో చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియాపై (115) సెంచరీతో గర్జించాడు.
Milestone Unlocked 🔓
2⃣0⃣0⃣0⃣ Test runs and counting for Captain Shubman Gill 👏👏
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/BOke0Mghyu
— BCCI (@BCCI) June 20, 2025