IND vs ENG : మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. సున్నాకే రెండు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన గిల్.. ఇంగ్లండ్ బౌలర్లను కాచుకొని ఓపికగా ఆడుతూ… ఫిఫ్టీ బాదాడు. టీ బ్రేక్ ముందు జో రూట్ ఓవర్లో మూడు పరుగులు తీసి ఎనిమిదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (30 నాటౌట్) గోడలా నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆర్చర్, కార్సే, వోక్స్ బుల్లెట్ బంతులను దీటుగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కు 86 రన్స్ రాబట్టింది. దాంతో, టీ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయిన గిల్ సేన 225 రన్స్ వెనకబడి ఉంది.
ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసిన అదే పిచ్ మీద భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చుతున్నారు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు సిద్దమైన జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇస్తారనుకుంటే సీన్ రివర్సైంది. వోక్స్ కొత్త బంతితో నిప్పులు చెరుగుతూ యశస్వీ జైస్వాల్(0)ను, తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్(0)ను సున్నాకే ఔట్ చేసి పెద్ద షాకిచ్చాడు.
5⃣0⃣ up for captain Shubman Gill – his 8th in Test cricket! 👍 👍#TeamIndia move past 80.
Updates ▶️ https://t.co/L1EVgGtx3a#ENGvIND | @ShubmanGill pic.twitter.com/InaHX94Djp
— BCCI (@BCCI) July 26, 2025
ఆ తర్వాత కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడగా.. లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి ఒకే ఒక రన్ చేసింది భారత్. లంచ్ తర్వాత గిల్, రాహుల్ రిస్క్ తీసుకోకుండా ఆడుతూ రన్స్ పిండుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు.