కారేపల్లి, జూలై 26 : కారేపల్లి మండలంలో కోమట్లగూడెం హైస్కూల్ లో శనివారం మధ్యాహ్నభోజనాన్ని ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూ, బియ్యం, కూరగాయలను ఆయన పరిశీలించారు. నాణ్యతపై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్ధుల ప్రతిభను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి, హెచ్ఎం శారద, శ్రీనివాస్, సీఆర్పీ పరమేశ్ పాల్గొన్నారు.