యాదగిరిగుట్ట, ఫిబ్రవరి27: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామివారి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం శుక్రవారం అంగరంగవైభవంగా జరిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన విష్ణుపుష్కరిణిలో సుదర్శన చక్రత్ ఆళ్వార్ల చక్రతీర్థ స్నానాలు, మహాపూర్ణాహుతి పూజలు పాంచరాత్రాగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం కల్యాణ లక్ష్మీనరసింహులకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం శాస్ర్తోక్తంగా జరిగాయి.
నేడు శ్రీస్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శ్రీస్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో భాస్కర్శర్మ, ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.