Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇటీవల సినిమాల కన్నా కూడా ఇతర విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం నడుపుతుందని, త్వరలో అతనిని రెండో వివాహం చేసుకోనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆమె తన టాటూలని ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటుందనే ప్రచారం కూడా ఉంది. సమంత వీపు పై భాగంలో వైఎంసీ అనే టాటూ ఉంటుంది.ఇది ఏ మాయ చేసావే సినిమాకు గుర్తుగా వేయించుకోగా, ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య బాండింగ్ బలపడిందని అంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆ టాటూ సమంత వీపుపై కనిపించలేదు. అది చెరిపేసిందని అందరు అనుకున్నారు.
కాని తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టి, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఫొటో షూట్ చేసింది. ఓ ఫొటోలో తన వీపుపై వైఎంసీ టాటూ కనిపించడంతో సమంత ఆ టాటూ చెరిపేయలేదని, అది అలానే ఉందని సంతోషిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం సమంత ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేయగా, అందులో వీపుపై ఈ టాటూ లేకపోవడంతో, ఆమె దాన్ని శాశ్వతంగా తొలగించి ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్న తరుణంలో సమంత ఈ టాటూను తొలగించుకొని ఉంటుందని పలువురు భావించారు. కాని ఈ ఫొటోలతో ఫుల్ క్లారిటీ వచ్చింది.
సమంత – నాగ చైతన్య రిలేషన్లో ఉన్నప్పుడు ఇద్దరూ తమ ముంజేతులపై రెండు బాణాలతో ఉన్న టాటూ వేయించుకున్నారు. ఈ పచ్చబొట్టు అర్థం మీ స్వంత వాస్తవికతను సృష్టించడం. అయితే అతనితో తెగదెంపులు చేసుకున్న తర్వాత సమంత వాటిని ఉంచుకుంటుందా,చెరిపేసిందా అనే దానిపై క్లారిటీ లేదు. నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా, సమంత .. దర్శకద్వయం రాజ్ అండ్ డీకేలలో ఒకరైన రాజ్ నిడిమోరుతో కలిసి జీవించేందుకు ప్లాన్ చేస్తుందనే వదంతులు వస్తున్నాయి. ఈ ప్రచారంపై సమంత గానీ, రాజ్ గానీ అధికారికంగా స్పందించలేదు.