IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆధిక్యం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్( 58నాటౌట్), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (61 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. లంచ్ తర్వాత టంగ్ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో నలభైల్లోకి వచ్చిన గిల్.. బౌండరీతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ కాసపటికే పంత్ కూడా ఫిఫ్టీకి చేరువయ్యాడు. దూకుడే మంత్రంగా ఆడుతున్న పంత్ టంగ్ ఓవర్లో సిక్సర్ బాదగా టీమిండియా ఆధిక్యం 400 దాటింది. వీళ్లిద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతానికి ఇండియా స్కోర్.. 232/3.
కేఎల్ రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(61 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. ప్రత్యర్థికి బజ్ బాల్ తరహా ఆటను చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో సైతం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పంత్, గిల్ జోడీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో భారత ఆధిక్యాన్ని 350కి పెంచింది. లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
Century stand ✅
Shubman Gill 🤝 Rishabh Pant
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#TeamIndia | #ENGvIND | @ShubmanGill | @RishabhPant17 pic.twitter.com/kj9wLGN82x
— BCCI (@BCCI) July 5, 2025