Poonch | ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు..!
Poonch | పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Poonch | పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ రహస్య స్థావరం నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, బుల్లెట్లు, ఛార్జ్ లీడ్, ఇనుప రాడ్, వైర్ కట్టర్, కత్తి, పెన్సిల్ సెల్, లైటర్ సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన అనంతరం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఇటీవల ఉధంపూర్‌లో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంసత్గఢ్లో పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం, సహజంగా ఏర్పడిన గుహలు ఉండడంతో ఉగ్రవాదులు ఇక్కడే దాక్కొని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. దాంతో ఉగ్రవాదుల ఏరివేత భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతున్నది. ఇప్పటి వరకు ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారు సైతం చిక్కలేదు. పగటిపూటే ఆపరేషన్ ముగించేందుకు ప్రయత్నలు జరగాలని మాజీ డీజీపీ ఎస్పీ వైద్ పేర్కొన్నారు. కశ్మీర్, జమ్మూ డివిజన్‌కు మధ్య తేడా ఉంటుందన్నారు. కశ్మీర్లో మైదానాల్లో దాక్కునే ఉగ్రవాదులు తప్పించుకోలేరని.. రాత్రి పూట వెలుతురులో వారిని ముట్టడించేందుకు అవకాశం ఉంటుందని.. జమ్మూ డివిజన్లోని కథువా, ఉధంపూర్, దోడా, కిష్త్వార్, రాంబన్, రాజోరి, పూంచ్ ప్రాంతాలలో దట్టమైన అడవులున్నాయని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

