మధిర, జులై 05 : కక్షిదారుల సంతృప్తే న్యాయవాదులకు సంతోషదాయకం కావాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శనివారం మధిరలోని రీక్రియేషన్ క్లబ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ (ఐ ఏ ఎల్) ఆధ్వర్యంలో న్యాయవాదుల శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ క్రిమినల్ కేసెస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంశాలపై ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం న్యాయం కాస్లీగా మారిందని, సామాన్యుడు సుప్రీంకోర్టు మెట్లెక్కే పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగంలోని సూత్రాలను శాసనసభలో చేసే చట్టాలు ఉల్లంగించినప్పుడు న్యాయ వ్యవస్థ తప్పక సమీక్ష చేయాల్సిందేనన్నారు. న్యాయ సమీక్ష అధికారం కోర్టులకు లేనప్పుడు న్యాయ వ్యవస్థ రూపం ప్రజాస్వామ్యంలో కనుమరుగై పోతుందన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం యువతరం న్యాయవిద్యను చదివేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. మానవ సంబంధాలు, విలువలు క్రమేణ దూరమవుతున్న ఈ రోజుల్లో న్యాయవాదులు ఉన్నత విలువలతో అందరికీ స్ఫూర్తి ఇవ్వాలన్నారు. న్యాయవాదులకు ప్రజా సంబంధాలు అవసరమన్నారు. పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి న్యాయ పరిజ్ఞానాన్ని కల్పించాలని, కార్మికులకు వారి హక్కుల గురించి తెలియజేయాలన్నారు.
తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్స జనార్దన్, సీనియర్ మామిడి హనుమంతరావు మాట్లాడుతూ.. నూతనంగా మారిన చట్టాలైన భారతీయ నాగరిక సురక్ష సంహిత – 2023, భారతీయ న్యాయ సంహిత – 2023 , భారతీయ సాక్ష్య అధికారనియం – 2023 చట్టాల వలన నేరస్తులు తప్పించుకునే అవకాశం లేదన్నారు. శిక్షణా తరగతుల ప్రారంభానికి ముందు మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తిని ఐఏఎల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.ఉదయ భాస్కర్, సహాయ కార్యదర్శి పి.పట్టాభి, సీనియర్ నాయకులు వాసిరెడ్డి వెంకటేశ్వరావు, ఐఏఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భాగం మాధవరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు పారుపల్లి అమర్చంద్, రాష్ట్ర నాయకులు కోటం రాజు, మునిగడప వెంకటేశ్వర్లు, ఖమ్మం బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శాంత కుమారి, ఐఏఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు తెల్లప్రోలు వెంకటరావు, కావూరి రమేశ్, షేక్ ఇమావళి, నెల్లూరి రవికుమార్, గంధం శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శులు షేక్ నస్రీన్, అరుణ, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోజెండ్ల పుల్లారావు, జింకల రమేశ్, ఐఏఎల్ ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఈ.సతీశ్, కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, ఉప్పిశెట్టి సునీల్ పాల్గొన్నారు.