వెల్దండ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ( KTR ) వెల్దండ మాజీ జడ్పీటీసీ జాప విజితా రెడ్డి ( Vijita Reddy ) మర్యాదపూర్వకంగా కలిశారు. లండన్ పర్యటన ముగించుకొని తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌ను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని దీమాను వ్యక్తం చేశారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె అన్నారు.