IPL 2025 : సొంత ఇలాకాలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీల వర్షం కురిపించారు. తొలి వికెట్‌కు 87 పరుగులతో.. భారీ స్కోర్‌కు గట్టి పునాది వేసిన సాయి సుదర్శన్(48) అర్ధ శతకం చేజార్చుకున్నాడు. అయితే.. శుభ్‌మన్ గిల్(76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. జోస్ బట్లర్(64) మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. వీళ్లిద్దరి దూకుడుతో గుజరాత్ స్కోర్‌బోర్డు పరుగులు తీసింది. ఒకదశలో.. 230 ప్లస్ కొడుతుందనుకున్న గుజరాత్‌ను ఉనాద్కాట్ దెబ్బకొట్టాడు. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో గిల్ సేన హైదరాబాద్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
ప్లే ఆఫ్స్‌పై కన్నేసిన గుజరాత్ టైటాన్స్ కీలక పోరులో భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్‌కు ఆహ్వానించగా పవర్ ప్లేలో ఓపెనర్లు సాయి సుదర్శన్(48), శుభ్‌మన్ గిల్(76 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు)లు దంచికొట్టారు. ఈ కుర్ర ద్వయం నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురించింది. ఎడాపెడా ఫోర్లు బాదేస్తూ స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించారిద్దరూ. దాంతో, గుజరాత్ జట్టు పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 82 రన్స్ చేసింది.
Innings break!
Fifties to skipper Shubman Gill and Jos Buttler power @gujarat_titans to a total of 224/6 💥
Will #SRH chase it down? 🤔
Scorecard ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/zzOPQ1ZKzJ
— IndianPremierLeague (@IPL) May 2, 2025
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు తొలి ఆరు ఓవర్లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంతకుముందు 78-0 అత్యుత్తమంగా ఉండేది. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత జీషన్ బౌలింగ్‌లో సాయి.. క్లాసెన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జోస్ బట్లర్(64) అండగా గిల్ మరింత దూకుడుగా ఆడాడు. షమీ వేసిన 10వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 120-1.
గిల్ ఔటయ్యాక బట్లర్ గేర్ మార్చాడు. స్వీప్ షాట్లతో బౌండరీలు బాదేశాడు. వాషింగ్టన్ సుందర్(21) తోడుగా జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్న అతడు అన్సారీ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం సాధించాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 4, 6 కొట్టి గుజరాత్ స్కోర్ 200 దాటించాడు. అయితే.. కమిన్స్ ఓవర్లో సెద్ద షాట్ ఆడబోయి అభిషేక్ చేతికి చిక్కాడు.
𝙎𝙖𝙞𝙡𝙚𝙙 𝙊𝙫𝙚𝙧 ⛵️
Brilliant Buttler goes back after igniting the #GT‘s innings with 64(37) 😎
Updates ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH | @josbuttler pic.twitter.com/KvFJFbeHvj
— IndianPremierLeague (@IPL) May 2, 2025
ఉనాద్కాట్ వేసిన 20వ ఓవర్లో సికర్స్ బాదిన సుందర్ .. ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా(6) గాల్లోకి లేపిన బంతిని అనికేత్ పరుగెడుతూ వెళ్లి అందుకున్నాడు. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ సైతం ఔట్ కావడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసింది.