చండూరు, మే 02 : నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్, దివంగత బొడ్డు సత్తయ్య మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కేంద్రంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కాస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొల్ల కురుమలకు అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి సత్తయ్య అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఆచ్చిన శ్రీనివాసులు, జక్కలి ఐలయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దోటీ సుజాత వెంకటేశ్ యాదవ్, బూడిద లింగయ్య, నల్పరాజు రామలింగయ్య, మలిగ యాదయ్య, బొబ్బిలి గోపాలకృష్ణ, బొడ్డు శివలింగం, బొబ్బల స్వామినాథ్ పాల్గొన్నారు.