IPL 2025 : ఐపీఎల్ ప్రతి సీజన్లో కొందరు ఆటగాళ్లు తమ మెరుపు బ్యాటింగ్‌తో హైలెట్ అవుతారు. మరికొందరేమో సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే.. 18వ సీజన్లో మాత్రం దిగ్వేశ్ రథీ (Digvesh Rathi) ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్ తీసున్న ఈ కుర్రాడు.. ఆపై తనదైన స్టయిల్లో సంబురాలు చేసుకుంటున్నాడు. కానీ, రిఫరీల ఆగ్రహానికి గురవుతూ భారీగా మ్యాచ్ ఫీజు కోల్పోతున్నాడు. అయితే.. రెండోసారి రథీకి జరిమానా విధించడం సహేతుకం కాదని రిఫరీపై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డాడు.
‘పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(Priyansh Arya) వికెట్ తీసిన రథీ.. అతడికి దగ్గరకు పరుగెత్తుతూ వెళ్లి నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అలా చేసినందుకు జరిమానా విధించడం సరైనదే. కానీ, రెండోసారి అతడు ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్కు దూరంగానే ఉండి నోట్‌బుక్ సెలబ్రేట్ చేసుకున్నా.. ఫైన్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. కానీ, రెండోసారి రథీ తప్పేమీ లేదు. అయినా సరే జరిమానా వేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.
Digvesh Rathi is the perfect representation of “Jaat Buddhi”. pic.twitter.com/RZYzzfNy3Y
— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) April 8, 2025
ఈమధ్య భారత క్రికెటర్లు కరీబియన్ ఆటగాళ్లను అనుసరిస్తున్నారు. . కొందరేమో తమ ఫేవరెట్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల తరహాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే.. నా సూచన ఏంటంటే.. ఎవరినో కాపీ కొట్టడం కాకుండా సొంత స్టయిల్లో సంబురాలు చేసుకుంటే మంచిది. అప్పుడు మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది’ అని ఈ లెజెండరీ ప్లేయర్ అన్నాడు.
పాతికేళ్ల దిగ్వేశ్ రథీకి ఇదే మొదటి ఐపీఎల్. అందుకే.. అతడు మైదానంలో ఎంతో ఉత్సాంగా కనిపిస్తుంటాడు. లెగ్ స్పిన్నర్ అయిన రథీ వికెట్ తీయగానే నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో అలరిస్తున్నాడు. మొదటిసారి అలా చేసినందుకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయిన అతడు.. రెండోసారి అదే తప్పిదంతో 50 శాతం ఫీజు పోగొట్టుకున్నాడు. అయితే.. మళ్లీ రిఫరీకి జరిమానా వేసే అవకాశం ఇవ్వకుండా గడ్డి మీద పేరు రాస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాడీ స్పిన్నర్. అయినా సరే అభిమానులు మాత్రం అతడి స్టయిల్‌ను ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకూ 6 మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Digvesh Rathi celebration 😂 #KKRvsLSG pic.twitter.com/4ioBpYmsfw
— Ashish (@Ashish2____) April 8, 2025