OTT | ప్రతి వారం కూడా ఓటీటీలో, థియేటర్లో పలు సినిమాలు ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాయి. థియేటర్లో హిట్టైన సినిమాలు కూడా కొద్ది రోజులకి ఓటీటీలో వస్తుండడంతో ప్రేక్షకులు వాటిని ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటారు. ఈ వారం యాక్షన్ ఎంటర్టైనర్స్తో పాటు హారర్ థ్రిల్లర్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా థియేటర్లో చూస్తే.. తమన్నా డిఫరెంట్ రోల్లో మెయిన్ లీడ్‌లో నటించిన ‘ఓదెల 2’ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇందులో భైరవిగా శివశక్తి పాత్రలో తమన్నా కనిపిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో కల్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతిస చిత్రం ఈ నెల 18వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది. చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కేసరి 2 చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ చూస్తే.. నెట్‌ఫ్లిక్స్ : ది గ్లాస్ డోమ్ (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఐ హోస్టేజి (మూవీ)- ఏప్రిల్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో గాడ్‌ఫాదర్ ఆఫ్ హాలెం (వెబ్‌సిరీస్)- ఏప్రిల్ 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది..ఖౌఫ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్ లో ది లాస్ట్ ఆఫ్ అజ్2 (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది స్టోలెన్ గర్ల్ (వెబ్‌సిరీస్) – ఏప్రిల్ 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోనీలివ్ లో చమక్: ది కన్‌క్లూజన్ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.