Prithviraj Sukumaran | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ ఫీమేల్ డైరెక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటుంది మేఘనా గుల్జార్. వాస్తవ ఘటనలను కథగా మార్చి సిల్వర్ స్క్రీన్‌పై కండ్లకు కట్టినట్టు చూపించే అతికొద్ది మహిళా దర్శకుల్లో ఒకరు మేఘనా గుల్జార్. ఈ దర్శకురాలు మరో సెన్సేషన్ స్టోరీని సినిమాగా చూపించబోతుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటా సెన్సేషన్ స్టోరీ అని ఆలోచిస్తున్నారా..?
2019లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హత్యాచార కేసు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కథనే సినిమాగా తెరకెక్కిస్తోంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. మాలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్, బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి Daayra టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ మూవీకి మేఘనా గుల్జార్తోపాటు యశ్, సిమా సహరచయితలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరి ఇండియావైడ్‌గా సెన్సేషన్ సృష్టించిన కేసును టేకప్ చేస్తున్న మేఘనా గుల్జార్ సిల్వర్ స్క్రీన్‌పై పృథ్విరాజ్ సుకుమారన్, కరీనాకపూర్‌తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
2019 నవంబర్‌లో 26 ఏండ్ల వెటర్నరీ డాక్టర్ శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ కూడా చేశారు.
Tamannaah Bhatia | పెళ్లెప్పుడు చేసుకుంటావని అడిగిన యాంకర్.. స్టన్నింగ్ రిప్లై ఇచ్చిన తమన్నా..!
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
Madhavi Latha | ఇప్పుడు కాకపోయిన త్వరలో కుక్క చావు చస్తావు.. మాధవీ లత శాపాలు