Tamannaah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇటీవల పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఈ భామ ఐటెం సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది. అయితే తమన్నా కొద్ది రోజులుగా విజయ్ వర్మతో రిలేషన్లో ఉంది. కాని ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పినట్టు సమాచారం. విజయ్ వర్మతో డేటింగ్ వరకు ఓకే, పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్పడంతో అతనితో తమన్నా బ్రేకప్ చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే తమన్నా ఇప్పుడు ఓదెల2 చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో శివశక్తి రోల్లో డిఫరెంట్ పాత్రలో కనిపించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ‘తమన్నా.. మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు?’ అని ఇంటర్వ్యూలో అడగ్గా.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా సమాధానం విని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక తమన్నా కొంతకాలంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలింది.. వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇటీవల వేర్వేరుగా ఈ ఇద్దరు ఫంక్షన్స్ కి , పార్టీలకి హాజరవుతున్నారు. దీంతో వారిద్దరు విడిపోయారని భావిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైతం ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇటీవల తమన్నా సినిమాలలో మెరుస్తుంది. ‘ఆఫర్లు లేకపోవడంతోనే చిన్న సినిమాల్లో నటిస్తున్నారా? అనే ప్రశ్నకు తమన్నా బదులిస్తూ.. తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదని.. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుందని.. లేకుంటే చిన్న సినిమా అవుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకూ సినిమాల్లో అమ్మాయిల్ని డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ రోల్స్‌లో చూశాం. కానీ శివశక్తి రోల్‌ను ఎవరూ స్క్రీన్‌పై చూపించలేదు. ఇది ఓ పెద్ద బాధ్యత. శివశక్తులు ఎలా ఉంటారో ప్రజలకు తెలియాలి. ఈ సినిమా చూస్తే అసలు ఎందుకు తీశామో వారికి అర్థమవుతుంది.’ అని చెప్పారు. ఇక ‘ఓదెల 2 ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.