Madhavi Latha | టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. 2007లో మహేష్ బాబు నటించిన “అతిథి” చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా కనిపించిన మాధవీలత 2008లో నచ్చావులే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమాకి అప్పట్లో మూడు నంది పురస్కారాలు కూడా దక్కాయి. ఆ తర్వాత “ష్…” (2009) ,నాని సరసన నటించిన “స్నేహితుడా” (2009) చిత్రాల్లో నటించారు. నచ్చావులే చిత్రం తర్వాత మాధవీలత చేసిన ఏ చిత్రం కూడా ఆశించిన ఫలితం సాధించలేదు. “అరవింద్ 2” (2013)లో కూడా నటించిన మాధవీ లత… తారకరత్నతో కలిసి నటించిన “చూడాలని చెప్పాలని” చిత్రంలో చేసింది. ఈ చిత్రం విడుదల కాలేదు.
తమిళ చిత్రం “ఆంబల” ద్వారా తమిళంలోకి కూడా అడుగుపెట్టింది. “ఉసురు” (2011), “లేడీ” (2020), “మధురై మణికక్కురవర్” (2021) అనే చిత్రాలు చేసింది. అయితే హీరోయిన్గా అనుకున్నంత ఫేమ్ రాకపోవడంతో మాధవీ లత రాజకీయాలలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీ లత, సమాజంలో జరుగుతున్న తప్పొప్పులపై ఎప్పుడు ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ ఫైర్ అయింది.
మాధవీ లత షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి శివాలయంలో ఉన్న బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశాడు. ఆ తర్వాత బసవన్నపై కాళ్లు కడుక్కోవడం కనిపించింది. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దానిమీద టాయిలెట్ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీ లత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది. ‘అంటే అన్నామంటారు.. అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో’ ..ఏం పర్లేదు ఏదో ఒకరోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడిస్తుంది.. అంతే కర్మ అనుభవించాలంటూ మాధవీలత పేర్కొంది.ఏం పర్లేదు ఇప్పుడు నవ్వి నోడు, కడుక్కున్నోడు కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు, ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లలకు కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుందంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయింది.
View this post on Instagram
A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi)