AUSW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చావోరేవో పోరులో పాకిస్థాన్ (Pakistan) బ్యాటర్లు తడబడ్డారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభనణతో ప్రధాన ప్లేయర్లు సైతం కనీస పోరాటం చేయకుండానే డగౌట్ చేరారు. అష్ గార్డ్నర్(4/21) తిప్పేయడంతో పాక్ 82 పరుగులకే కుప్పకూలింది. అలియా రియాజ్(26), ఇరమ్ జావేద్(12)లు టాప్ స్కోరర్లు అంటే ఆసీస్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. బలమైన బ్యాటింగ్ యూనిట్ ఉన్న కంగారూలకు స్వల్ప లక్ష్య ఛేదన నల్లేరు మీద నడక కానుంది.
సెమీస్ రేసులో వెనుకబడిన పాకిస్థాన్ కీలక పోరులో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కోలేక 82 పరుగులకే పాక్ ఆలౌటయ్యింది. టాపార్డర్ బ్యాటర్ల తడబాటుతో పాక్ ఇన్నింగ్స్ నత్తనడకను తలపించింది. 13 పరుగుల వద్ద కెప్టెన్ మునీబా అలీ(7) వికెట్ తీసిన మొలినెక్స్ పాక్‌ను ఒత్తిడిలో పడేసింది.
An overly cautious powerplay left Pakistan struggling to break free for the rest of the innings
Live: https://t.co/ZUrGieKLug | #AUSvPAK pic.twitter.com/6oGDUweHAu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
ఆ తర్వాత సథర్లాండ్, వరేహమ్లు వికెట్ల వేట మొదలెట్టగా 39 పరుగులకే పాక్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ దశలో అలియా రియాజ్(26) మెరపులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. సిద్రా అమిన్(12), ఇరమ్ జావేద్(12)లు ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో అష్ గార్డ్నర్(4/21)తో పాటు అనాబెల్ సథర్లాండ్(2/15), జార్జియా వరేహమ్(2/16)లు రాణించారు.