Ollie Pope : పాకిస్థాన్ పర్యటనను ఇంగ్లండ్ భారీ విజయంతో ఆరంభించింది. ముల్తన్ టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్‌లో ముందంజ వేసింది. మరోవైపు కెప్టెన్‌గా ఓలీ పోప్ (Ollie Pope) రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ముల్తాన్‌లో ఇంగ్లండ్ చిరస్మరణీయ గెలుపు అనంతరం ఆసక్తికర సంఘటన జరిగింది. మైదానంలోని విక్టరీ బోర్డుపై స్కెచ్ పెన్నుతో తమ జట్టు పేరును రాయబోయి పోప్ తికమక పడ్డాడు.
ఏం జరిగిందంటే..? ఎక్కడైనా సరే విక్టరీ బోర్డుపై మొదట గెలుపొందిన జట్టు పేరు.. ఆ తర్వాత ఓడిన జట్టు పేరు రాస్తారు. కానీ, పోప్ మాత్రం విచిత్రంగా విజేత, ఓడిన జట్టు.. రెండు చోట్లా అతడు ఇంగ్లండ్ అనే రాశాడు. దాంతో, అక్కడివాళ్లంతా ఒక్క క్షణం నవ్వుకున్నారు. ఆ తర్వాత పోప్ నాలుక్కరచుకొని.. మళ్లీ సరి చేశాడు. విజేతల స్థానంలో ఇంగ్లండ్ అని, ఓడిన జట్టుగా పాకిస్థాన్ పేరు రాశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ollie Pope contribution to Historic win at Multan vs Pakistan#PAKvsENGpic.twitter.com/xoqTULFvDE
— The Realistic (@TheRealistic_) October 11, 2024
సొంతగడ్డపై ఏ జట్టు అయినా సింహంలా గర్జిస్తుంది. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతూ విజయఢంకా మోగిస్తుంది. కానీ.. పాకిస్థాన్ (Pakistan) మాత్రం గెలుపు మా వల్ల కాదంటూ ఓడిపోతూ వస్తోంది. నెలక్రితమే బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాక్.. ఇప్పుడు ఇంగ్లండ్ (England) జోరుకు తలొంచింది. ముల్తాన్ టెస్టులో ఐదో రోజు పోరాడలేక దారుణ ఓటమి మూటగట్టుకుంది. నాలుగో రోజే ఆరు వికెట్లు కోల్పోయిన పాక్.. జాక్ లీజ్ తిప్పేయడంతో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.