Air India Express | చెన్నై : తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండైంది. శనివారం సాయంత్రం తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి విమానం షార్జా వెళ్లేందుకు టేకాఫ్ కాగా, కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రెండు గంటల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం పైలట్లు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో 141 మంది ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన పైలట్లకు ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విమానం చక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతోనే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా తిరుచ్చి ఎయిర్‌పోర్టులో అధికారులు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. పారామెడికల్ సిబ్బందితో పాటు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
🚨 UPDATE: Air India Express flight IX 613 has landed safely! All passengers are reported safe. 🙌✈️
Jai Mata Di🙏🙏#Trichy | #AirIndia | #AirIndiaExpress | #Sharjah | #trichyairport pic.twitter.com/jvmsoR4vbH
— Shubham Singh (@Shubhamsingh038) October 11, 2024
ఇవి కూడా చదవండి..
Navaneet Rana | నా భార్య మహా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదు.. ఆమె రాజ్యసభకు వెళ్తుంది : రవి రాణా
Sayaji Shinde | అజిత్ పవార్ పార్టీలో చేరిన విలక్షణ నటుడు సయాజీ షిండే.. Video
Miss Kolkata Models | దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో మోడల్స్.. తర్వాత ఏం జరిగిందంటే?