Miss Kolkata Models | దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో మోడల్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
Miss Kolkata Models | దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. అసభ్యకరంగా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే మండపంలోకి వెళ్లారు. దుర్గా మాత విగ్రహం ముందు ఫొటోలు దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కోల్కతా: దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. (Miss Kolkata Models) అసభ్యకరంగా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే మండపంలోకి వెళ్లారు. దుర్గా మాత విగ్రహం ముందు ఫొటోలు దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మోడల్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రుల నేపథ్యంలో కోల్కతాలో దుర్గా మాతా మండపాలను వినూత్న రూపాల్లో ఏర్పాటు చేస్తుంటారు.
కాగా, మిస్ కోల్కతా మోడల్స్ అయిన హేమోశ్రీ, భద్ర, సన్నతి మిత్ర ఒక దుర్గా మాతా పూజా పండల్ను సందర్శించారు. అయితే సంప్రదాయ దుస్తులకు బదులుగా అసభ్యకరంగా, రెచ్చగొట్టేలా ఉన్న దుస్తులను వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి ఫొటోలు దిగారు.
మరోవైపు ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో వారు పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ మోడల్స్పై నెటిజన్లు మండిపడ్డారు. దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో హాజరుకావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లకు చెప్పులతో విగ్రహం ముందు ఫొటోలు దిగడాన్ని తప్పుపట్టారు. ఇది సిగ్గుచేటని కొందరు విమర్శించారు. దుర్గా మాత అమ్మవారిని, ఆధ్యాత్మికతను గౌరవించని వీరు ఎలాంటి మహిళలు అని మరికొందరు ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

