Sayaji Shinde : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో అక్కడ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు చేరికలకు తెరలేపాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటామోటా నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విలక్షణ నటుడు సయాజీ షిండే రాజకీయ రంగప్రవేశం చేశారు.
శుక్రవారం ఆయన అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) లో చేరారు. అజిత్ పవార్ స్వయంగా కండువా కప్పి షిండేను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ సీనియర్ నేతలు అందరూ పాల్గొన్నారు. కాగా మహారాష్ట్రలో ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2021 ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ శివసేన, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని కొలువుదీర్చింది.
ఏక్నాథ్ షిండే శివసేన నుంచి 42 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ పంచెన చేరి ముఖ్యమంత్రి కాగా, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి 8 మందిని చీల్చి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నాడు. బీజేపీ చీలిక నేతలకు పదవుల ఆశచూసి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
#WATCH | Actor Sayaji Shinde joins NCP in the presence of Maharashtra Deputy CM Ajit Pawar and other senior NCP leaders in Mumbai. pic.twitter.com/u9F2amjJLE
— ANI (@ANI) October 11, 2024