Air India Express | చెన్నై : తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్‌పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టుపై విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది. చక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు వెల్లడించారు.
సాంకేతిక లోపం తలెత్తిన విమానంలో మొత్తం 141 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో అధికారులు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. పారామెడికల్ సిబ్బందితో పాటు డాక్టర్లను అందుబాటులో ఉంచారు.
ఇవి కూడా చదవండి..
Navaneet Rana | నా భార్య మహా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదు.. ఆమె రాజ్యసభకు వెళ్తుంది : రవి రాణా
Sayaji Shinde | అజిత్ పవార్ పార్టీలో చేరిన విలక్షణ నటుడు సయాజీ షిండే.. Video
Miss Kolkata Models | దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో మోడల్స్.. తర్వాత ఏం జరిగిందంటే?