Souarav Ganguly : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) మళ్లీ టెస్టు జెర్సీ వేసుకోబోతున్నాడు. కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదిన్నర తర్వాత టెస్టు జట్టుకి ఎంపికైన అతడు బంగ్లాదేశ్‌పై సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల పంత్‌పై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Souarav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా దృష్టిలో పంత్ టెస్టుల్లో అత్యత్తమ ఆటగాడు’ అని దాదా అన్నాడు.
‘నా దృష్టిలో భారత అత్యుత్తమ టెస్టు ఆటగాడు పంత్. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు నిజంగా ఆల్‌టైమ్ గ్రేట్. అయితే.. అతడు గతంలో మాదిరిగా తన దూకుడును కొనసాగిస్తేనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు. ఇక.. పంత్ వన్డేల్లో, టీ20ల్లో మరింత మెరుగవ్వాల్సి ఉంది. అతడిలో చాలా ప్రతిభ ఉంద. రాబోయే రోజుల్లో పంత్ భారత దేశపు అత్యుత్తమ ఆటగాడు అవుతాడని నా ప్రగాఢ నమ్మకం’ అని గంగూలీ తెలిపాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన స్క్వాడ్‌లో ప్రధాన పేసర్ షమీ లేకపోవడంపై దాదా స్పందించాడు.
Eventful weekend. 🏏#RP17 pic.twitter.com/gVTCBPHlmq
— Rishabh Pant (@RishabhPant17) September 8, 2024
‘గాయం నుంచి కోలుకుంటున్న షమీ బంగ్లా సిరీస్‌కు దూరం అయ్యాడనేది నాకు తెలుసు. అయితే.. అతడు త్వరలోనే జట్టులోకి వస్తాడు. ఎలాగూ ఆస్ట్రేలియా పర్యటన ఉందిగా. షమీ జట్టుతో కలిస్తే పేస్ బౌలింగ్ యూనిట్ ప్రమాదకరంగా మారుతుంది. ఇక బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) విషయానికొస్తే.. అతడొక అద్భుతమైన యువ పేసర్. వేగంగానే కాదు ఎక్కువ స్పెల్స్ బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది.
అతడు బెంగాల్ తరఫున ఆడడం.. వికెట్లు తీయడం నేను చూశాను. సిరాజ్, షమీల మాదిరగానే ఆకాశ్ కూడా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు’ అని గంగూలీ వెల్లడించాడు. భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన గూంగూలీ వీడ్కోలు అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలందించాడు. ప్రస్తుతం దాదా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Captals) ఫ్రాంచైజీకి డెరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగుతున్నాడు. ఇదే జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.