MSK Prasad | ఐపీఎల్ జట్టులో టీమిండియా మాజీ సెలెక్టర్.. స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం
MSK Prasad : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కాసులు కురిపించే ఈ లీగ్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్లు కూడా భాగమవుతున్నారు. కోచ్‌గా, మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) కూడా ఐపీఎల్ జట్టులో చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) టీమ్...
MSK Prasad : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కాసులు కురిపించే ఈ లీగ్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్లు కూడా భాగమవుతున్నారు. కోచ్‌గా, మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) కూడా ఐపీఎల్ జట్టులో చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) టీమ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్(Strategic Consultant)గా అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం అధికారికంగా ఈరోజు ప్రకటించింది.
‘ప్రసాద్ అనుభవం, క్రికెట్‌పై అతడికున్న ప్రేమ మాకు ఎంతో ఉపయోగపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. అతడి సేవలు మా ఫ్రాంచైజీకి ఎంతో ఉపకరిస్తాయి’ అని లక్నోమేనేజ్మెంట్ తెలిపింది. అనుభవజ్ఞుడైన ప్రసాద్ రాకతో లక్నో జట్టు బలోపేతం కానుంది. స్ట్రాటజిక్ అనలిస్ట్‌గా అతను ప్రతిభావంతులైన క్రికెటర్లను కనిపెట్టడం , వాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపరచడం వంటివి చూసుకోనున్నాడు.
Former India cricketer MSK Prasad joins the Super Giants as our Strategic Consultant! 🤝
Full story 👉 https://t.co/kwtmp8awBE pic.twitter.com/gW9kiQJePM
— Lucknow Super Giants (@LucknowIPL) August 17, 2023
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ప్రసాద్ భారత జట్టు సెలెక్టర్‌గా పనిచేశాడు. అంతేకాదు ఆంధ్ర క్రికెటో అసోసియేషన్ డైరెక్టర్‌గా సేవలందించాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 96 మ్యాచ్‌లు ఆడిన ప్రసాద్ 4,000 రన్స్ చేశాడు. జాతీయ జట్టు తరఫున 1999 నుంచి 2001 మధ్యలో 6 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు.
ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన లక్నో జట్టు

ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ దాటలేకపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయంతో టోర్నీకి దూరం కావడం, కీలక మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు రాణించకపోవడం ఆ జట్టు అవకాశాల్ని దెబ్బతీశాయి. దాంతో, 17వ సీజన్లో కప్పు కొట్టాలనే లక్ష్యంతో లక్నో ప్రణాళికలు రచిస్తోంది. ఈమధ్యే హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower)ను తప్పించింది. అతడి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్(Justin Langer)ను నియమించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Caribbean Premier League | ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన విండీస్ ఓపెనర్.. అత్యధిక పరుగుల వీరుడు అతనే
Adille Sumariwalla | వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సుమరివల్లా.. తొలి భారతీయుడిగా ఘనత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

