Caribbean Premier League | ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన విండీస్ ఓపెనర్.. అత్యధిక పరుగుల వీరుడు అతనే
Caribbean Premier League : వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ జాన్సన్ చార్లెస్(Johnson Charles) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (Caribbean Premier League) ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 98 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో 2,641 పరుగులు ఉన్నాయి. దాంతో, గతంలో విండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్...
Caribbean Premier League : వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ జాన్సన్ చార్లెస్(Johnson Charles) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (Caribbean Premier League) ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 98 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో 2,641 పరుగులు ఉన్నాయి. దాంతో, గతంలో విండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్ (Lendl Simmons) నెలకొల్పిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 11వ సీజన్లో సెయింట్ లుసియా కింగ్స్(Saint Lucia Kings ) ఓపెనర్‌గా బరిలోకి దిగిన చార్లెస్ జమైకా తలైవాస్(Jamaica Tallawahs) జట్టుపై ఈ ఫీట్ సాధించాడు. ఈ డాషింగ్ ఓపెనర్ 22 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 24 రన్స్ చేశాడు. దాంతో, సిమన్స్‌ను వెనక్కి నెట్టేశాడు.
కుడి చేతివాటం బ్యాటర్ జాన్సన్ అనతికాలంలోనే పవర్ హిట్టర్‌గా పేరొందాడు. కరీబియన్ లీగ్‌లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు 128.45 స్ట్రయిక్ రేటుతో పరుగులు సాధించాడు. అందులో 17 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 94. మరో విషయం ఏంటంటే..? ఈ లీగ్‌లో చార్లెస్ ఏడు ప్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20ల్లోనూ అతడి గణాంకాలు గొప్పగా ఉన్నాయి. 3 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 5,648 రన్స్ బాదాడు. అయితే.. ఈమధ్యే స్వదేశంలో టీమిండియాపై మాత్రం తేలిపోయాడు. ఐదు టీ20 సిరీస్‌లో పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు.
లెండిల్ సిమన్స్

ఆగస్టు 16న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ మొదలైంది. ఈ సీజన్లో ఫుట్‌బాల్ మ్యాచ్ మాదిరిగా రెడ్ కార్డును ప్రవేశ పెట్టారు. స్లో ఓవర్ రేటును కట్టడి చేయడం కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు బ్యాటర్లు ఉద్దేశ పూర్వకంగా సమయం వృథా చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధించనున్నారు.
ఇవి కూడా చదవండి
Adille Sumariwalla | వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సుమరివల్లా.. తొలి భారతీయుడిగా ఘనత
Mithali Raj | డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. ఆ అద్భుత ఇన్నింగ్స్‌కు 11 ఏళ్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

