VVS Laxman | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న క్రికెటర్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు.
Also Read..
Hijack | కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడిపై ప్రయాణికుడి కాల్పులు
Anaya Bangar: క్రికెటర్లు నగ్న ఫోటోలు పంపారు.. ఇంటర్వ్యూలో చెప్పిన అనయ బంగర్
BCCI Contract | అభిషేక్, నితీశ్‌కు బీసీసీఐ కాంట్రాక్టు!