Hijack | కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడిపై ప్రయాణికుడి కాల్పులు
Hijack | అమెరికాలోని బెలిజ్ (Belize)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు.
Hijack | అమెరికాలోని బెలిజ్ (Belize)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, తోటి ప్రయాణికుడు కాల్పులు జరపడంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ట్రాపిక్ ఎయిర్ (Tropic Air plane)కు చెందిన ఓ చిన్న విమానం గురువారం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులోని ఓ ప్రయాణికుడు కత్తితో ప్రయాణికులకు బెదిరించాడు. విమానం హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికుల్ని గాయపరిచాడు కూడా. అతడి చర్యకు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పు్ల్లో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. నిందితుడిని అమెరికా పౌరుడు 49 ఏళ్ల అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెలిజ్ పోలీసు కమిషనర్ చెస్టర్ విలియమ్స్ తెలిపారు. అతడు విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిందితుడిని కాల్చి చంపిన ప్రయాణికుడిని కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.
Also Read..
CT Scan | సీటీ స్కాన్‌తో క్యాన్సర్!.. వయసు ఎంత తక్కువైతే ముప్పు అంత ఎక్కువ!
Florida State University | అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
Planet K2-18b | సౌర వ్యవస్థ ఆవల జీవం!.. కే2- 18బీ గ్రహంపై జీవసంబంధ ఆనవాళ్లు!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

