IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏ జట్టుకు ఆడుతాడు? అనేది ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. 17వ సీజన్లో కెప్టెన్సీ మార్పుతో నిరాశ చెందిన హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)ను వీడుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వేలంలో రోహిత్ భారీ ధర పలుకుతాడని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో రోహిత్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది.
చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ధాటిగా సాగుతున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. ఆట కాసేపు నిలిచిపోవడంతో, వాన తగ్గిందా? లేదా? అనేది చూసేందుకు రోహిత్ బయటికి వచ్చాడు. ఆ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అతడిని ‘వచ్చే సీజన్లో ఏ జట్టుకు ఆడుతావు?’ అని అడిగారు.
Izzat se bol pic.twitter.com/KHbWvkZYbS
— poetvanity (@PoetVanity__) October 19, 2024
ముందుగా ఓ అభిమాని ‘రోహిత్ ఐపీఎల్ 18వ సీజన్లో ఏ జట్టుకు ఆడుతావు?’ అని అడగగా.. భారత కెప్టెన్ బదులివ్వలేదు. ఆ కాసేపటికే మరో ఫ్యాన్.. ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేయ్’ అని అంటాడు. అందుకు హిట్‌మ్యాన్ నవ్వుతూ.. ‘మీరే చెప్పండి ఏ జట్టుకు ఆడాలి?’ అని సమాధానం వాళ్లకే వదిలేశాడు. దాంతో, రోహిత్ మనసులోని మాట తెలుసుకోవాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.