అమరావతి : ఏపీలో మద్యం విధానంపై (Liquor policy) మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్ (YS Jagan) మద్యం వ్యాపారాన్ని జగన్ గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని, ప్రజల ఆరోగ్యమూ దెబ్బతిందని ఆరోపించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు అడ్డురావొద్దనే ఎక్సైజ్‌శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాతే రూ. 99 కే నాణ్యమైన మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చామని అన్నారు. బ్రాండ్ల రేట్లు తగ్గించడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో టెండర్ కమిటీ వేస్తామని వెల్లడించారు.