Monty Panesar : భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) టెస్టుల్లో 37వ సారి ఐదు వికెట్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో బంగ్లాదేశ్‌ను వణికించిన సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. దాంతో.. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) అశ్విన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అశ్విన్ గనుక ఇంగ్లండ్ తరఫున ఆడి ఉంటే ఇప్పటికే వీడ్కోలు పలికేవాడని పనేసర్ అన్నాడు.
‘ఒకవేళ అశ్విన్ ఇంగ్లండ్ తరఫున ఆడి ఉంటే ఇప్పటికే అతడిని వీడ్కోలు చెప్పాల్సిందిగా క్రికెట్ బోర్డు కోరేది. ఎందుకంటే.. ఇంగ్లండ్ సెలెక్టర్లు ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటారు. ప్రతిభగల యువ క్రికెటర్లను ఆడించేందుకు ప్రాధాన్యం ఇస్తారు’ అని పనేసర్ అన్నాడు. అంతేకాదు.. నాథన్ లియాన్(Nathan Lyon), అశ్విన్‌లలో ఎవరు గొప్ప స్నిన్నర్? అనే ప్రశ్నకు సైతం పనేసర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
‘నా దృష్టిలో లియాన్ గొప్ప స్పిన్నర్. అయితే.. అశ్విన్ భారత్‌లోనే బెస్ట్ బౌలర్. బౌలింగ్ చేసేటప్పుడు కూడా తానొక బ్యాటర్ అని అశ్విన్ అనుకుంటాడు. అతడు ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను సులువుగా అర్థం చేసుకుంటాడు. తెలివిగా వాళ్లను బోల్తా కొట్టిస్తాడు. చెప్పాంటే.. బ్యాటర్ల మనసులో ఏముందో చదివేస్తాడు. లియాన్ కంటే అతడికి మ్యాచ్ అవగాహన చాలా ఎక్కువ’ అని పనేసర్ అన్నాడు.
అయితే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)2024-25లో అశ్విన్ ఆసీస్ స్పిన్ మాంత్రికుడు లియాన్ కంటే ముందున్నాడు. అశ్విన్ ఇప్పటివరకూ 11సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. లియాన్ 10 సార్లు ఈ ప్రదర్శన చేశాడంతే.
అశ్విన్(113 సెంచరీ అభివాదం
చెపాక్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆరు వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లిట్టన్ దాస్‌ను వెనక్కి పంపడం ద్వారా అశూ ఖాతాలో ఐదో వికెట్ చేరింది. అప్పటికీ అతడి వయసు 38 ఏండ్ల 2 రోజులు. దాంతో, భారత జట్టు తరఫున టెస్టుల్లో 5 వికెట్ల వికెట్ల ప్రదర్శన చేసిన అతి పెద్ద వయస్కుడిగా అశ్విన్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కిన విషయం తెలిసిందే.