Joe Root : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) టెస్టు కెరీర్లో మరో ఘనత సాధించాడు. సొంత ప్రేక్షకుల సమక్షంలో ఈ మధ్యే 32వ సెంచరీ బాదిన రూట్.. శనివారం 12 వేల పరుగుల క్లబ్లో చేరాడు. వెస్టిండీస్ (West Indies)తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్(Edgebaston)టెస్టులో ఇంగ్లండ్ మాజీ సారథి ఈ మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) రికార్డు బద్ధలు కొట్టాడు.
అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా రూట్ చరిత్ర పుటల్లో నిలిచాడు. టెస్టుల్లో టాప్ స్కోరర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(భారత్), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), రాహుల్ ద్రవిడ్(భారత్), అలెస్టర్ కుక్(ఇంగ్లండ్), కుమార సంగక్కర(శ్రీలంక)లు రూట్ కంటే ముందున్నారు.
⬆️ Joe Root | 11,954*
⬇️ Brian Lara | 11,953Joe Root takes another step up the mountain 🏔️ pic.twitter.com/4rZBeBKps6
— England Cricket (@englandcricket) July 27, 2024
ఫ్యాబ్ 4లో ఒకడైన రూట్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దంచేస్తున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో కరీబియన్ బౌటర్లను ఉతికేసిన ఈ రన్ మెషీన్ శతక గర్జన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన రూట్.. విండీస్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ రికార్డు సెంచరీ బాదేశాడు.
🚨 1️⃣2️⃣,0️⃣0️⃣0️⃣ 🚨
We are witnessing GREATNESS! 🐐 pic.twitter.com/OLuS4GKn2H
— England Cricket (@englandcricket) July 27, 2024
ప్రపంచ క్రికెట్లోని మేటి బ్యాటర్లలో ఒకడైన రూట్ 32వ సెంచరీతో రికార్డులు బద్ధలు కొట్టాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson), ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steven Smith) రికార్డును సమం చేశాడు. మరొక్కసారి మూడంకెల స్కోర్ కొడితే ఇంగ్లండ్ లెజెండ్ అలెస్టర్ కుక్ రికార్డు బ్రేక్ చేస్తాడు.
విలియమ్సన్ 172 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించగా.. స్మిత్ 174 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. రూట్‌కు మాత్రం 32వ శతకానికి చేరుకునేందుకు 260 ఇన్నింగ్స్‌లు పట్టింది. టెస్టుల్లో అత్యధిక శతక వీరుల జాబితాలో ఈ ముగ్గురు టాప్‌లో ఉండగా.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 29 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.