IND vs SL : భారత్, శ్రీలంకల మధ్య టీ20 సిరీస్ మరికొసేపట్లో మొదలవ్వనుంది. పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు ఇరుజట్లు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన లంక సారథి చరిత అసలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య మాట్లాడుతూ వరల్డ్ కప్ విజయం గతమని, ఇప్పుడు ఈ సిరీస్ తమకు కొత్త సవాల్ అని అన్నాడు. తొలి మ్యాచ్ తుది జట్టును వెల్లడించిన సూర్య.. శివం దూబే, సంజూ శాంసన్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకోలేదని చెప్పాడు.
భారత జట్టు : శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత అసలంక(కెప్టెన్), దసున్ శనక, వనిందు హసరంగ, మహీశ్ థీక్షణ; మథీశ పథిరన, అసిథ ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక.