గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 23, 2020 , 16:21:30

కరోనా ఎఫెక్ట్.. క్రికెటర్ల జీతాల్లో 15 శాతం కోత

కరోనా ఎఫెక్ట్.. క్రికెటర్ల జీతాల్లో 15 శాతం కోత

లండన్:‌  కరోనా మహమ్మారి   వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో క్రీడా రంగం కూడా ఒకటి. కరోనా వల్ల స్పాన్సర్లు తమ ఒప్పందాలను రద్దు  చేసుకోవడం,  అంతర్జాతీయంగా క్రికెట్‌ సిరీస్‌లు   నిలిచిపోవడంతో ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా నష్టపోయాయి.   కరోనా కష్టకాలంలో 2020-21 ఇంగ్లాండ్‌ పురుషుల క్రికెట్‌ సెంట్రల్‌ కాంట్రాక్టు కలిగిన ఆటగాళ్లు  12నెలల పాటు తమ వేతనాల్లో 15శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. 

ఈ నేపథ్యంలో  టీమ్‌ ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ పార్ట్‌నర్‌షిప్‌(TEPP)తో  ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒప్పందం చేసుకున్నది.  క్రికెటర్లు, ఉద్యోగులతో పాటు అనుబంధ క్రికెట్‌ సంఘాలకు చెల్లించే  నిధుల్లో  వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే  50శాతం కోత విధించిన  విషయం తెలిసిందే.