England Team : ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్‌లో బెన్ స్టోక్స్(Ben Stokes) సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ్లైట్ దిగిన ఇంగ్లండ్ బృందానికి అక్కడి అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం స్టోక్స్ సేన ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు వెళ్లింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
నిరుడు సొంత గడ్డపై యాషెస్ సిరీస్(Ashes Series)ను 2-2తో డ్రా చేసుకున్న ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు..అబూదాబీలో సన్నద్ధత క్యాంప్‌లో పాల్గొంది. అక్కడి నుంచి నేరుగా స్టోక్స్ సేన భారత విమానం ఎక్కింది. రెండేండ్లుగా బాజ్‌బాల్ ఆటతో జోష్ మీదున్న స్టోక్స్ సేన భారత గడ్డపై అదే తీరుగా చెలరేగాలనే పట్టుదలతో ఉంది.
VIDEO | England Cricket team arrives in Hyderabad for the 5-match Test series. The first Test is scheduled to be played from January 25 at the Rajiv Gandhi International Stadium. pic.twitter.com/YzGknyrSPw
— Press Trust of India (@PTI_News) January 21, 2024
మరోవైపు దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయంతో సిరీస్ సమం చేసిన రోహిత్ సేన కూడా ఇంగ్లండ్‌కు దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2023-25 ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, రెహన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్ స్టో, షోయబ్ బాషిర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హర్ట్లీ, జాక్ లీచ్, ఒలీ పోప్, ఒలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, డాన్ లారెన్స్.