Sri Rama | పట్టాభిరాముడి పాలన సూత్రాలు..
రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది.
Sri Rama | రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది. పాలనపై ఆయనకున్న అవగాహన ఎంతటిదో.. తనను అయోధ్యకు తీసుకువెళ్లడానికి అడవికి వచ్చిన భరతుడితో మాట్లాడే సందర్భంలో తెలుస్తుంది. భరతుడిని కుశల ప్రశ్నలు అడుగుతూ.. పాలన ఎలా ఉండాలో తెలియజేస్తాడు. ప్రభువు ఎలా మసులుకోవాలో వివరిస్తాడు. మంత్రిమండలి కూర్పు ఎలా ఉండాలో విశదపరుస్తాడు.
- పాలకుడి దగ్గర ఉండే అమాత్యుడు ఎక్కువ నిద్రపోయే వాడై ఉండకూడదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రాజ్య రహస్యాలను ఎన్నడూ బయట పెట్టకూడదు. రాజకీయ, ఆర్థిక శాస్ర్తాలు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. పాలకుడికి కానీ, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు, అధికారులకు కానీ.. ఎదుటివారిని చూడగానే వారి మనసు అంచనా వేయగలిగే శక్తి ఉండాలి.
- రాజు రైతుల పక్షపాతిగా ఉండాలి. ఏ కారణం వల్లనైనా రైతులు పన్నులు చెల్లించలేకపోతే.. శిస్తు కట్టమని వారిని బలవంతం చేయొద్దు. ఈ విషయంలో పొరపాటు జరిగితే ప్రజల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- సైనికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశభక్తి ఉన్నవారిని, మేధావులను, ప్రభుత్వంపై అభిమానం ఉన్నవారిని గౌరవించాలి.
- పాలకుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించి.. ఆంతరంగికులతో చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలి. గత పాలకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

