England : ఇంగ్లండ్ జట్టుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పేసర్ మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ గాయపడ్డారు. క్రిస్ వోక్స్ సైతం ఫిట్నెస్ కోసం నానా పాట్లు పడుతున్నాడు. అంతలోనే యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson) సైతం గాయం పడ్డాడు. దాంతో ఇండియాతో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కండరాల గాయం (Harmstring Injury)తో బాధపడతున్న ఈ స్పీడ్‌స్టర్ కోలుకునేందుకు సమయం పట్టడనుంది. సో.. జూన్ 20 మొదలయ్యే మొదటి టెస్టులో అతడు ఆడడం దాదాపు అసాధ్యమే.
‘యువ పేసర్ గస్ అట్కిన్సన్ కుడి కాలి తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఇండియాతో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశముంద’ని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో అట్కిన్సన్ గాయపడ్డాడు. దాంతో.. అతడు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.
Gus Atkinson is set to miss the first Test against India after he sustained a right hamstring strain vs Zimbabwe 😫
Via @TelegraphSport pic.twitter.com/tn24T95nPT
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 3, 2025
ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) కొత్త సీజన్లో భాగంగా టీమిండియాతో సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి టెస్టులోపు అట్కిన్సన్ కోలుకొని, ఫిట్నెస్ సాధించకుంటే ఇంగ్లండ్‌కు వైవిధ్యమైన పేస్ బౌలర్ కొరత ఏర్పడనుంది. నిరుడు వేసవిలో అరంగేట్రం చేసిన అట్కిన్సన్ 12 మ్యాచుల్లోనే 55 వికెట్లు పడగొట్టాడు.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20న ఇరుజట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్ మొదలవ్వనుంది. జూలై 2న రెండో టెస్టు, జూలై 10న మూడోది, జూలై 23న నాలుగో మ్యాచ్, జూలై 31న ఐదో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడుతాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఇరుజట్లకు ఇదే మొదటి సిరీస్. కాబట్టి.. ఇరుజట్లు విజయం కోసం తమ అస్త్రాలను ఉపయోగించనున్నాయి. సిరీస్ కొల్లగొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. కుర్రాళ్లతో నిండిన జట్టను గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారనుంది.