కల్వకుర్తి రూరల్ : సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి ఏఎస్సై హనుమంత్ రెడ్డి ( ASI Hanmanth Reddy ) అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాల పట్ల అవగాహన ఉంటే తప్ప వాటి నుంచి తప్పించు కోలేరన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని, లోన్ ఇప్పిస్తామని ఫోన్ చేసి సంప్రదిస్తే వాటిని నమ్మవద్దని సూచించారు. అపరిచితులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీ,ఎం ఆధార్, పాన్‌కార్డు ఇతర వివరాలు తెలుపవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పర్వతాలు, కానిస్టేబుళ్లు మల్లేష్, గోపి ఉన్నారు.