Khamenei | అణు ఒప్పందంపై అమెరికా తొలి ప్రతిపాదన.. విమర్శించిన ఇరాన్
Khamenei | ఇరాన్ (Iran) తో అణు ఒప్పందం (Nuclear programme) కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒమన్ (Oman) రాజధాని మస్కట్ (Muscut) లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
Khamenei : ఇరాన్ (Iran) తో అణు ఒప్పందం (Nuclear programme) కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒమన్ (Oman) రాజధాని మస్కట్ (Muscut) లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. దాంతో ఈ విషయంలో తొలి అడుగు పడింది.
అయితే అణుఒప్పందానికి సంబంధించి అమెరికా నుంచి వచ్చిన తొలి ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విమర్శలు చేశారు. యూఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో 100 న్యూక్లియర్ పవర్ప్లాంట్లు ఉన్నా దేశం సుసంపన్నం కాకుంటే అవి ఉపయోగపడవని, మళ్లీ నిధుల కోసం అమెరికా ముందు చేయిచాచాల్సి వస్తుందని అన్నారు.
అయితే అమెరికాతో అణు ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు మాత్రం ఖమేనీ పేర్కొనలేదు. అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ యూఎస్ ప్రతిపాదన గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే ఆక్సియోస్ అనే వార్తా వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ తన చుట్టు పక్కల దేశాలతో కలిసి యురేనియం శుద్ధి కోసం ఒక కన్సార్టియంను ఏర్పాటు చేయాలని అమెరికా ప్రతిపాదించింది. కానీ దీనివల్ల టెహ్రాన్‌కు ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
అయితే ఇరుదేశాల మధ్య ఒప్పందం విఫలమైతే ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మరింత పతనమయ్యే అవకాశం ఉంది. మరోవైపు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు కొద్దికాలంగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణుఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ సంసిద్ధత వ్యక్తంచేశారు.
దీనిపై ఇటీవల ఒమన్‌లో ఉన్నతస్థాయి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ కూడా ఎదురుచూస్తోందని అన్నారు. ఇరాన్‌తో గతంలో అణుఒప్పందం చేసుకున్న అమెరికా.. 2018లో ట్రంప్ హయాంలోనే దాని నుంచి వైదొలిగింది.
Read More >>
డొనాల్డ్ ట్రంప్ మనవరాలి కోసమే ఆ పని చేశా.. పోలీసుల విచారణలో యువకుడి వెల్లడి
చిన్న గ్రామంలో వాతావరణాన్నీ అంచనాకట్టగల కొత్త మాన్సూన్ మోడల్..!
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురు పేషెంట్లు మృతి
కన్నడ భాషపై వివాదం.. రాజ్యసభ నామినేషన్‌ను వాయిదా వేసుకున్న కమల్ హాసన్
మహిళపై కక్షతో సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు.. వ్యక్తి అరెస్ట్
సంజయ్ రౌత్ ఉండగా ఉద్ధవ్‌కు వేరే రాజకీయ శత్రువులు అక్కర్లేదు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

