IND vs ENG : స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు(Womens Team) పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 428 రన్స్ కొట్టిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. ప్రమాదకరమైన సోఫియా డంక్లే(11)ను రేణుకా సింగ్ వెనక్కి పంపింది.
ఆ కాసేపటికే హీథర్ నైట్(11)ను పూజా వస్త్రాకర్ ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టింది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టును నాట్ సీవర్ బ్రంట్(35), టామీ బ్యూమంట్(6) ఆదుకున్నారు. వీళ్లు ఆచితూచి ఆడుతూ మూడో వికెట్‌కు 39 రన్స్ జోడించారు. దాంతో, లంచ్ సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇంకా 361 పరుగులు వెనకబడి ఉంది.
Three quick wickets on Day 2 but India have managed to put up a solid total in the first innings.#INDvENG | 📝: https://t.co/Qye5bbd4Rj pic.twitter.com/TmDqshI3NI
— ICC (@ICC) December 15, 2023
సుభా సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోర్ చేసింది. వచ్చినవాళ్లు వచ్చినట్టు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడంతో 428 పరుగులు బాదింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 410 రన్స్ బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్(HarmanPreet Kaur) సేన.. అనూహ్యంగా రెండో రోజు తొలి సెషన్లోనే ఆలౌటయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్ చెరో మూడేసి వికెట్లతో రాణించారు.
Indian batters impressed on the opening day of the first Women’s Test in the country since 2014 🔥#INDvENG pic.twitter.com/bASpW7a7Un
— ICC (@ICC) December 14, 2023
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం(DY Patil Stadium)లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత అమ్మాయిలు సమిష్టిగా సత్తా చాటారు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. సుభా సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్(68) ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ అరంగేట్రంలోనే ఫిఫ్టీ బాదారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(49) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) అర్ధ శతకాలతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, టీమిండియా తొలి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది.