EURO 2024 : ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్(EURO 2024)లో మరో సంచలనం నమోదైంది. తొలి నాలుగు మ్యాచుల్లోనే 16 గోల్స్‌తో 48 ఏండ్ల రికార్డు బద్ధలైన చోట.. హ్యారీ కేన్ (Harry Kane) సారథ్యంలోని ఇంగ్లండ్ (England) చరిత్ర సృష్టించింది. వరుసగా ఐదు విజయాలతో టోర్నీలో కొత్త అధ్యాయం లిఖించింది.
సోమవారం సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, 2020 నుంచి యూరో చాంపియన్‌షిప్ నాలుగు సీజన్లలో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుగా ఇంగ్లిష్ టీమ్ రికార్డు నెలకొల్పింది. తద్వారా యూరో చాంపియన్‌షిప్ చరిత్రలోనే వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా కొత్త చరిత్రను లిఖించింది.
⏱️ Bellingham’s goal is the difference so far…#EURO2024 | #SRBENG pic.twitter.com/r8O0VY7fVS
— UEFA EURO 2024 (@EURO2024) June 16, 2024
ఇంగ్లండ్ జట్టు 2020 ఎడిషన్‌లో చెక్ రిపబ్లిక్కు చెక్ పెట్టింది. ఆ తర్వాతి సీజన్లలో వరుసగా స్కాట్లాండ్, క్రొయేషియా, స్లొవేకియాలను చిత్తు చేసింది. తాజాగా జర్మనీలో జరుగుతున్న ఎడిషన్‌లో ఇంగ్లండ్ బలమైన సెర్బియాను మట్టికరిపించి సాకర్ పండుగ చరిత్రలోనే అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.