BJP MP : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాజధాని రాయ్‌పూర్ (Raipur) నుంచి ఎంపీగా గెలిచిన బ్రిజ్మోహన్ అగర్వాల్ (Brijmohan Agrawal) .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) రమణ్‌సింగ్ (Raman Singh) నివాసానికి వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా తాను మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలువడంతో ‘రాయ్‌పూర్ సిటీ సౌత్’ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇది నాకు ఎంతో భావోద్వేగపూరితమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
#WATCH | Raipur: BJP MP from Raipur, Brijmohan Agrawal tenders his resignation as MLA in the Chhattisgarh government at Assembly Speaker Raman Singh’s residence. pic.twitter.com/nKJqiZkbwX
— ANI (@ANI) June 17, 2024