Venkatesh | టాలీవుడ్లో కామిక్ టైమింగ్ ఉన్న యువ దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి (Anil ravipudi)..స్టైలిష్ కామింగ్ టైమింగ్‌తో వినోదాన్ని పంచే యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతో అలరించిన ఈ ఇద్దరు మరో సినిమాతో అందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తుంది. వెంకీ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశాడట అనిల్ రావిపూడి. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ కొత్త ప్రాజెక్ట్ కోసం వైజాగ్‌లో డైలాగ్స్ రాసే పనిలో ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త షికారు చేస్తోంది. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ కామెడీతో కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని తెలుస్తుండగా.. 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదే నిజమైతే వెంకీ మామ అభిమానులకు మాత్రం శుభవార్తే అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
వెంకటేశ్ ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2లో నటిస్తున్నాడు. రానా దగ్గుబాటితో కలిసి నటించిన రానా నాయుడు ఫస్ట్ సీజన్‌కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అడల్ట్ కంటెంట్‌తో అభ్యంతర సంభాషణలతో సాగే ఫస్ట్ సీజన్‌పై ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి నెలకొంది.