ఓ రోజు సీమోను, జబెదేయా అనే జాలరులు చేపల వేటకు సముద్రానికి వెళ్లారు. రాత్రంతా శ్రమించినా వారికి ఒక్క చేపా చిక్కలేదు. వారి శ్రమను చూసిన ప్రభువు ‘రండీ ఇదిగో ఇక్కడ మీ వలలు విసరండి, చేపలు పట్టుకోండీ’ అని భరోసా ఇచ్చాడు. ప్రభువు చూపిన చోట వల విసిరాడు సీమోను. మరుక్షణం అతని వల నిండా చేపలు పడ్డాయి.
‘ఇదేం విడ్డ్డ్డూరం! మనం ప్రతిరోజూ తిరుగాడే సముద్రమేగా, మనకు తెలియని ప్రదేశమా? అయినా ఇంతలా ఎన్నడూ చేపలు పడలేదు’ అని ఆశ్చర్యంతో ముక్కన వేలేసుకున్నారు. ‘చేపలు పడితేనే ఇంత ఆనందమా? ఇలా ఆశ్చర్యపడాలా? ఇక మనుషుల్ని పట్టేవానిగా నీవు మారబోతున్నావు’ అని సీమోనుతో అన్నాడు ప్రభువు. ఆనాటి నుంచి నేటిదాకా ఆ సీమోనే ప్రభువుకు తొలి శిష్యుడు. అతనికే పేతురనే పేరు కూడా.
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024