England : స్వదేశంలో వీడ్కోలు మ్యాచ్‌కు వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) రెడీ అయ్యాడు. దాంతో, ఈ లెజెండరీ పేసర్‌కు విజయంతో వీడ్కోలు పలికేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. దాంతో, వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు కోసం సెలెక్టర్లు పటిష్టమైన తుది జట్టును ప్రకటించారు. జూలై 10వ తేదీన లార్డ్స్ వేదికగా జిమ్మీ ఆఖరిసారి బౌలింగ్ చేయబోతుండగా.. యువ పేసర్ గట్ అట్కిన్సన్, జేమీ స్మిత్‌లు అరంగేట్రం చేయనున్నారు.
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
England’s newest Test quick, Gus Atkinson ⚡️ pic.twitter.com/I5ArqZOohK
— ESPNcricinfo (@ESPNcricinfo) July 8, 2024
వీడ్కోలు టెస్టుకు మరో రెండు రోజులే ఉందనగా ఈ స్పీడ్‌స్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెండు మూడు రోజులుగా నేను యథావిధిగానే నెట్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా. చివరి టెస్టు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. నా ముందున్న ముఖ్యమైన పని ఏంటంటే.. బాగా బౌలింగ్ చేయడం, విజయంతో కెరీర్ ముగించడం. అందుకని పూర్తిగా బౌలింగ్ మీదే ఫోకస్ పెడుతున్నా. అయితే.. ఎమోషన్స్ అనేవి కామన్. కాబట్టి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా అని 41 ఏండ్ల అండర్సన్ తెలిపాడు.