ECB : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇకపై సచిన్(Sachin) – అండర్సన్(Anderson) పేరిట సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలిసారిగా ఇరుదేశాల దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ట్రోఫీ ఇది. దాంతో, ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనుకుంది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB). కానీ, అనుకోకుండా ఈ ఈవెంట్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 14 శనివారం ట్రోఫీ ప్రారంభోత్సవం నిర్వహించాలనుకుంది ఈసీబీ.
లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజున ట్రఫీని ఆవిష్కరించాలని భావించారు. కానీ, అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash)తో భారత ఆటగాళ్లు విచారంలో ఉన్నారు. దాంతో, ట్రోఫీ ఆవిష్కరణను వాయిదా వేయాలని ఈసీబీ నిర్ణయించింది.
Anderson-Tendulkar Trophy Launch Postponed After Ahmedabad Plane Crash
.
.
.
.
.#AndersonTendulkarTrophy #AhmedabadPlaneCrash #CricketNews #SachinTendulkar #JamesAnderson #TestCricket #CricketTribute #CricketLegends #StumpsandBails pic.twitter.com/Z2IKSV3xn8— STUMPSNBAILS (@stumpnbails) June 14, 2025
‘భారత దేశంలో విషాద సంఘటన జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల గౌరవార్థం సచిన్ – అండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. ట్రోఫీ ప్రారంభోత్సవం ఎప్పుడు చేయాలనే విషయమై బీసీసీఐ ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇరుబోర్డులకు అమోదయోగ్యమైన తేదీన ట్రోఫీని ఆవిష్కరిస్తాం’ అని ఈసీబీ తెలిపింది.
సచిన్ – అండర్సన్ ట్రోఫీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిస్ కొత్త సైకిల్లో తొలి సిరీస్ కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. జూన్ 20న తొలి టెస్టుకు ముందు భారత ఏ జట్టు.. సీనియర్ స్క్వాడ్‌లోని ఆటగాళ్లతో కలిసి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టుకు ఆరు రోజుల సమయం ఉండడంతో.. ఆలోపే ట్రోఫీ ప్రారంభోత్సవం ఉంటుందని సమాచారం.
యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 275 మంది మరణించారు. ఎయిరిండియా బోయింగ్ 171-8 డ్రీమ్‌లైనర్‌లోని 241 మంది మృత్యువాత పడగా.. బీజే వైద్య కళాశాల హాస్టల్లోని మెడికోలు 24 మంది చనిపోయారు.
Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy. pic.twitter.com/R7PPGGo6Lj
— Narendra Modi (@narendramodi) June 13, 2025