Mega Lok Adalath | కోరుట్ల, జూన్ 14: పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో శనివారం న్యాయమూర్తి పసుల పావనీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పలు కేసుల్లో రాజీ మార్గంలో కక్షిదారుల సమస్యలను పరిష్కరించారు. అలాగే రాయికల్ మండల కేంద్రానికి మామిడిపల్లి రాము, హరిణి దంపతులు ఎడాది క్రితం మనస్పర్ధల కారణంగా విడిపోయారు.
కాగా లోక్ అదాలత్లో దంపతుల మధ్య రాజీ కుదుర్చడం ద్వారా తిరిగి వారు ఏకమైనట్లు బార్ అసోసియోషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియోషన్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, కోశాధికారి చింతకింది ప్రేమ్, జాయింట్ సెక్రటరీ చిలివేరి రాజశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడకుంట్ల సదాశివరాజు, గొనె సదానంద నేత, న్యాయవాదులు పాల్గొన్నారు.