ECB : జూన్‌లో భారత జట్టుతో జరుగబోయే సిరీస్కోసం ఇంగ్లండ్ (England) పక్కాగా సన్నద్ధమవుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలోని టీమిండియాకు చెక్ పెట్టేందుకు బెన్ స్టోక్స్ బృందం పకడ్బందీ వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ బోర్డు మాజీ పేసర్ టిమ్ సౌథీ(Tim Southee)ని తమ కోచింగ్ సిబ్బందిలో చేర్చుకుంది. భారత్‌పై మెరుగైన రికార్డు కలిగిన అతడిని ‘స్పెషలిస్ట్ స్కిల్స్ కన్సల్టంట్’ (Specialist Skills Consultant)గా నియమించింది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన సౌథీ మూడు ఫార్మట్లకు తన సేవలు అందించనున్నాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వే (Zimbabwe)తో జరగనున్న ఏకైక టెస్టుతో ఈ కివీస్ మాజీ కెప్టెన్ తన బాధ్యతల్లో మునిగిపోనున్నాడు. ‘టీమిండియాతో టెస్టు సిరీస్ వరకూ సౌథీ స్పెషలిస్ట్ స్కిల్స్ కన్సల్టంట్గా కొనసాగుతాడ’ని గురువారం ఇంగ్లండ, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
Tim Southee has joined England men’s coaching staff as a specialist skills consultant.
The former New Zealand pace bowler joins on a short-term basis through to the end of the India Test series pic.twitter.com/XVm398hy1t
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు భారత్‌తో తలపడనుంది. కీలకమైన ఈ సిరీస్‌ను బోర్డు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే.. అనుభవజ్ఞుడైన మాజీ పేసర్ టిమ్ సౌథీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఇంగ్లండ్ పేస్ బౌలర్లను మరింత రాటుదేలుస్తాడనే ఈసీబీ భావిస్తోంది. మరోవైపు ది హండ్రెడ్ లీగ్(The Hundred League)లో ఆటగాడిగాను సౌథీ బరిలోకి దిగనున్నాడు. బర్మింగ్హమ్ ఫీనిక్స్ ఫ్రాంచైజ్ ప్రధాన పేసర్‌గా ఆడనున్నాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన సౌథీ నిరుడు డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియాపై చిరస్మరణీయ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు.. కివీస్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా పేరొందాడు. మూడు ఫార్మాట్లలో తన పేస్ పవర్ చేపించిన ఈ స్పీడ్‌స్టర్ వన్డేల్లో 221 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 391, టీ20ల్లో 164 వికెట్లు సౌథీ ఖాతాలో ఉన్నాయి.