Donald Trump | వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్న వేళ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ ఓ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకొనే (US goods) చాలా రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్ (zero tariffs)లతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
ఖతార్ వేదికగా జరిగిన ఓ వ్యాపార సమావేశంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భారత్ ఓ ఆఫర్ చేసింది. ఇది ఒక ప్రాథమిక ఒప్పందం. ఇందులో భారత్ అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసింది’ అని తెలిపారు. అయితే, ఆఫర్ పరిధిలోకి వచ్చే నిబంధనలు, రంగాల గురించి మాత్రం ట్రంప్ వివరించలేదు. ఇక ట్రంప్ ప్రకటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో గొప్ప పురోగతి ఉందని ట్రంప్ గతనెల వెల్లడించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఓ ఒప్పందానికి రానున్నట్లు అప్పట్లో అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వచ్చింది.
Also Read..
India tariffs | అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు..!
Mukesh Ambani | ఖతార్ వేదికగా.. ట్రంప్‌తో ముఖేశ్ అంబానీ భేటీ